హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గరుడసేవ ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో

తిరుమలలో గరుడసేవను పురస్కరించుకుని గ్యాలరీల్లో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను TTD ఈవో ముద్దాడ రవిచంద్ర శనివారం పరిశీలించారు. వైద్యం, అన్నప్రసాదం, తాగునీరు, పారిశుధ్యం, పోలీసు, విద్యుత్, శ్రీవారి సేవ తదితర విభాగాలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.