KDP: కుమార్తె పుట్టెంటుకల వేడుక నిర్వహణ విషయంలో భర్తతో విభేదాలు రావడంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సింహాద్రిపురం మండలంలో చోటుచేసుకుంది. పైడిపాలేనికి చెందిన హేమలతకు ఏడాది కుమార్తె ఉంది. సోమవారం పుట్టెంటుకల వేడుకను ఘనంగా నిర్వహించాలని ఆమె కోరగా భర్త అంగీకరించలేదని స్థానికులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన హేమలత ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
వేడుకపై విభేదాలు.. మహిళ ఆత్మహత్య..!


