హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిల్లల చదువులో తల్లిదండ్రుల పాత్ర కీలకం

MDK: పిల్లలను సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచి చదువు వైపే మళ్లేలా చూడాలని పీఎం శ్రీ ఉన్నత పాఠశాల HM జ్ఞానమాల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు చదువులో రాణించాలంటే వారి పట్ల తల్లిదండ్రుల ప్రోత్సాహం, పర్యవేక్షణ అత్యంత ఆవశ్యకమని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.