JN: గణపతి నిమజ్జన ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదని నర్మెట సీఐ దేవేందర్ తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీలు, భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం నిర్వహించాలని సూచించారు. డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్స్ వల్ల వృద్ధులు, గుండె సంబంధిత సమస్యలున్నవారు, తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ
నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు: సీఐ


