హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు సైకిళ్ళు బహుమతిగా ఇచ్చిన ఉపాధ్యాయుడు

JGL: బుగ్గారం మండలం సిరికొండ జెడ్పీహెచ్ఎస్‌లో దూరం నుంచి వచ్చే ఇద్దరు బాలికలకు గణిత టీచర్ వి.రత్నాకర్ సొంత డబ్బుతో సైకిళ్లు కొని శనివారం బహూకరించారు. సర్పంచ్ చేతుల మీదుగా అందజేశారు. హెచ్ఎం వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ విజయ్, ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ సభ్యులు, విద్యార్థులు హాజరై రత్నాకర్‌ను అభినందించారు.