హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలుడు అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు

BHNG: బొమ్మలరామారం మండలం వాలు తండాకు చెందిన ధీరావత్ శ్రీహరి (14) మూడు రోజులుగా కనిపించడం లేదు. బంధువులు, పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదన్నారు. తండ్రి ధీరావత్ శ్రీను శనివారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలిపారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు.