హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే పాయం

BDK: హైదరాబాద్‌లో శనివారం ఖైరతాబాద్‌ శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ ప్రతినిధుల ఆహ్వానం మేరకు మహాగణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.