JGL: జగిత్యాల పట్టణంలో ఈ నెల 23, 24 తేదీల్లో వినాయక నిమజ్జన ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ సూచించారు. శనివారం ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి చింతకుంట చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. మండపాల నిర్వాహకులు అధికారులకు సహకరించాలని, శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు.
తెలంగాణ
'భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జన ఉత్సవాలు నిర్వహించాలి'


