TPT: ఏర్పేడు మండలంలోని మునగలపాలెం టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ రాపూరి సతీశ్ నాయుడు మృతి చెందారు. పాముకాటుకు గురై ఆయన మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సర్పంచిగా పనిచేసిన సమయంలో సతీష్ నాయుడు ప్రజల సంక్షేమం, గ్రామ అభివృద్ధికి కృషి చేశారని గ్రామస్థులు గుర్తుచేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పాముకాటుకు TDP నాయకుడి మృతి


