హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మాన్యవర్ కాన్షీరామ్ వర్ధంతి సభను జయప్రదం చేయండి'

RR: అక్టోబర్ 9న బడంగ్‌పేట్‌లో జరిగే మాన్యవర్ కాన్షీరామ్ వర్ధంతి సభను జయప్రదం చేయాలని బీఎస్పీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో కరపత్రం విడుదల చేశారు. 15% ఉన్న అగ్రకులాలకు 46% ఎమ్మెల్యేలు, 75% ఉన్న బహుజనులకు కేవలం 30% స్థానాలు దక్కడంలో జరుగుతున్న రాజకీయ దోపిడీని ప్రశ్నించాలని అన్నారు.