MNCL: జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాలలో శనివారం జాతీయ స్వచ్ఛంద రక్తదాన శిబిరంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ ప్రారంభించిన ఈ ర్యాలీలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 1న జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
స్వచ్ఛంద రక్తదాన శిబిరంపై అవగాహన ర్యాలీ


