ఖమ్మం: చింతకాని మండలం లచ్చగూడెంలో కర్రి అనసూర్య మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం వితంతు పింఛన్ అందక మందులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. మహిళా సంఘం రుణం తీసుకోకపోయినా వాయిదాలు చెల్లించలేదన్న కారణంతో నాలుగు నెలల క్రితం బ్యాంకు ఖాతా ఫ్రీజ్ అయిందని తెలిపారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
తెలంగాణ
మందులకు డబ్బుల్లేక మహిళ మృతి


