హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొక్కలు నాటిన అదనపు కలెక్టర్‌

KMM: తల్లాడ మండలం పినపాకలో శనివారం స్వచ్ఛతా హి సేవ-2026లో భాగంగా స్థానిక జిల్లా పరిషత్‌ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ శ్రీజ మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్‌, వికసిత్‌ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతోందని తెలిపారు.