ములుగు జిల్లాలోని మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క శనివారం రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కళ్యాణ మండపం, డార్మిటరీ, అన్నదాన సత్రం తదితర సౌకర్యాల ఏర్పాటుపై చర్చించారు. ఆలయ పవిత్రత, ప్రస్తుత నిర్మాణానికి ఇబ్బంది కలగకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు. త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించి డిజైన్ ఖరారు చేయాలని నిర్ణయించారు.
తెలంగాణ
ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క సమీక్ష


