హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఎండిపోతున్న పంటలు

VKB: జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన మేర వర్షాలు కురవలేదు. దీంతో వాగులు పారలేదు, కుంటలు, చెరువులు నిండకపోవడంతో భూగర్భజలాలు పడిపోతున్నాయి. ఖరీఫ్‌లో వేసిన పంటలకు నీరు సరిగా అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు తమ కళ్లెదుటే ఎండిపోతుండడంతో రైతులు బోరున విలపిస్తున్నారు.