హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలమురళీకృష్ణ జయంతి వేడుకల్లో ఈటల రాజేందర్

హైదరాబాద్ చిక్కడపల్లిలోని త్యాగరాయ గణ సభ ప్రధాన హాల్‌లో పద్మవిభూషణ్ డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ 96వ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ సంగీత కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎల్.వి. చిన్నారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని, బాలమురళీకృష్ణ సేవలను స్మరించుకున్నారు.