హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటో బోల్తా.. తప్పిన ప్రమాదం

KMM: వైరా మండలం స్టేజి పినపాక వద్ద శనివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని బయటకు తీసి ప్రధమ చికిత్స అందించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.