హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నీరు ఊరాలి.. పంట పారాలి'

NRPT: తుంగభద్ర నది పూర్తిగా ఎండిపోవడంతో తుమ్మిళ్ల సమీపంలో రైతులు నీటి గుంతలు తవ్వి పంటలకు ఊట నీటిని వినియోగిస్తున్నారు. కనీసం ఒకటి, రెండు తడులు అందితే పంట కొంతైనా చేతికొస్తుందనే ఆశతో ఒక్కో రైతు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. వారం రోజుల్లోనే నదీతీరం వెంట సుమారు 460 గుంతలు తవ్వడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తుంది.