హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలమయమైన రహదారి.. ప్రజల అవస్థలు

JN: పాలకుర్తి మండల కేంద్రం నుంచి అయ్యంగారిపల్లి మీదుగా ఈరవెన్ను వరకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. గతంలో రహదారికి ఇరువైపులా కంకర పోసినా పనులు పూర్తికాక సుమారు ఆరు కిలోమీటర్ల మేర రోడ్డు గుంతలమయంగా ఉంది. దీంతో ప్రజలు,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారి పనులు పూర్తి చేసి,రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.