హైదరాబాద్: 28°C
క్రైమ్

పెళ్లయిన 18 రోజులకే విద్యార్థిని ఆత్మహత్య

TG: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లికి చెందిన పల్లవి(20) కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లయిన 18 రోజులకే భర్త కానిస్టేబుల్ శ్రీకాంత్ రెడ్డి వరకట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసినట్లు ఆమె తల్లి సంధ్య ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.