హైదరాబాద్: 28°C
క్రైమ్

మద్యం దుకాణంలో అగ్నిప్రమాదం

TG: రంగారెడ్డి జిల్లా కందుకూరులోని మద్యం దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దుకాణంలో రూ.1.2 కోట్ల విలువైన మద్యం, రూ.60 వేలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు వ్యాపించగానే అందులో ఉన్నవారు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది.