హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారు ఢీకొని వ్యక్తి మృతి

ELR: దెందులూరు మండలం సింగవరం పరిధిలో కారు ఢీకొని భీమడోలు మండలం గుండుగోలను గ్రామానికి చెందిన వంజరపు ప్రసాద్ (52) మృతి చెందాడని దెందులూరు ఎస్సై డి. వెంకట కుమార్ శుక్రవారం తెలిపారు. గుండుగోలను నుంచి ద్విచక్ర వాహనంపై కొమిరేపల్లిలోని పొలానికి వెళ్తుండగా ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్తున్న కారు ఢీకొంది. తీవ్ర గాయాలైన అతనిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు.