హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనవరిలో నంది నాటకోత్సవాలు

GNTR: తెనాలి వేదికగా జనవరిలో నంది నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సచివాలయంలో ప్రకటించారు. జనవరి 10న కందుకూరి అవార్డుల ప్రదానంతో ఉత్సవాలు ప్రారంభమై, వారం రోజుల పాటు ఎంపికైన నాటకాల ప్రదర్శనలు ఉంటాయన్నారు. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.