హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాముకాటు నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమం

కామారెడ్డి పట్టణంలోని UPHC ఇస్లాంపురా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పాముకాటు నివారణపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పాముకాటు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తక్షణమే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం, మూఢనమ్మకాలకు లోనుకాకుండా వైద్య చికిత్స పొందడం వంటి అంశాలను డా. చందన ప్రియ వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఉన్నారు.