BHPL: కాటారం మండలంలో చేయూత పింఛన్ల దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభమైనట్లు ఎంపీడీవో అడ్డూరి బాబు ఇవాళ తెలిపారు. వివిధ కేటగిరీల్లో మొత్తం 673 దరఖాస్తులు అందగా, ఆరుగురు డీవీవో అధికారులు క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుల పత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ నెల 30లోపు పరిశీలన పూర్తి చేస్తామని ఎంపీడీవో తెలిపారు. దరఖాస్తుదారులు అందుబాటులో ఉండాలని సూచించారు.
తెలంగాణ
చేయూత పింఛన్ల దరఖాస్తుల పరిశీలన ప్రారంభం


