BHPL: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో మహాదేవపురం మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద శనివారం గోదావరి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి 46,990 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీకి ఉన్న 85 గేట్లకు గాను 85 గేట్లను ఎత్తిన అధికారులు, వచ్చిన వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తెలంగాణ
కాళేశ్వరం వద్ద కొనసాగుతున్న వరద ప్రవాహం


