హైదరాబాద్: 28°C
తెలంగాణ

లింగాలలో నీటి సమస్య పరిష్కారం

NGKL: లింగాల గ్రామపంచాయతీ పరిధిలోని బంజారా కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారమైంది. వాటర్ ట్యాంక్ ఓవర్‌ఫ్లో నీటిని మెయిన్‌లైన్‌కు అనుసంధానం చేసే పనులను సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య, వార్డు మెంబర్ నేనావత్ వెంకట్ పర్యవేక్షించి పనులు చేయిస్తున్నారు. దీంతో కాలనీకి నీటి సరఫరా పునరుద్ధరణ కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.