MDCL: శామీర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఓ వాహనం పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపి టైరు మారుస్తుండగా.. వేగంగా వచ్చిన వ్యాన్ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిని నాచారం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి


