హైదరాబాద్: 28°C
తెలంగాణ

గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి 521 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో

NRML: గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం పెరిగింది. గత 24 గంటల్లో ప్రాజెక్టులోకి సగటున 521 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 358.70 మీటర్లు కాగా, ప్రస్తుతం 357.15 మీటర్లకు నీటిమట్టం చేరింది. నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుతం 1.024 టీఎంసీలుగా ఉంది. గత ఏడాది ఇదే సమయానికి నీటిమట్టం 358.80 మీటర్లు, పూర్తి 1.83 టీఎంసీల నిల్వ ఉంది.