హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ట్యాంకులు శుభ్రం చేయాలి'

GDWL: మాన్‌దొడ్డి గ్రామంలో ప్రజలకు సరఫరా చేసే మినీ నీటి ట్యాంకులు అపరిశుభ్రంగా మారాయి. నసనూరుకు వెళ్లే రహదారిలో BC కాలనీ ప్రజల నీటి అవసరాల కోసం ఈ ట్యాంకులు ఏర్పాటు చేయగా, ఇక్కడి ప్రజలు మిషన్ భగీరథ నీరు రానప్పుడు ఈ నీటినే తాగుతారు. నెలలు గడుస్తున్నా.. ట్యాంకులు శుభ్రం చేయకపోవడంతో వాటి చుట్టూ నాచు పేరుకుపోయింది. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.