హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: స్వచ్ఛతకు ప్రతి ఒక్కరు సహకరించాలి: కలెక్టర్ డీకే బాలాజీ

కృష్ణా: పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. మచిలీపట్నం పాత రైల్వే స్టేషన్ వద్ద కొత్త మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు. కలెక్టర్ అధికారులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి కుటుంబం మొక్కలు నాటి సంరక్షించాలని చెప్పారు.