SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు చెరువు కట్ట అలుగు వద్ద రోడ్డు ధ్వంసమైంది. కట్టపై ఉన్న మట్టి అంతా గత భారీ వర్షాలకు కోతకు గురై రెండు నెలలు కావస్తున్నా, అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఇవాళ తెలిపారు. నల్లవాగు చెరువు కట్ట రోడ్డుపై బైకులు వెళ్లాలంటే ఇబ్బందులు అవుతున్నాయని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరారు.
తెలంగాణ
అలుగు వద్ద ధ్వంసమైన రోడ్డుతో ఇబ్బందులు


