హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు కిందపడి వ్యక్తి మృతి

ELR: విజయవాడ - విశాఖ రైలు మార్గంలో చేబ్రోలు వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తి (40-45 ఏళ్లు) రైలు కిందపడి మృతిచెందాడు. నిన్న రాత్రి తిరుమల ఎక్స్ప్రెస్ లోకో పైలట్ సమాచారంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, అతని ఆచూకీ తెలిసిన వారు వెంటనే రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.