హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

KMR: సాయి రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఇవాళ KMR లేబర్ అడ్డ వద్ద పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో కూలీలకు పలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాలు, గంజాయి సేవించవద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, OTPలను ఎవరికీ చెప్పవద్దని తెలిపారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు సమాచారం అందించాలన్నారు.