హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇళ్ల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని వినతి

NZB: రుద్రూర్‌లో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించాలని గ్రామ జామా మసీదు కమిటీ ప్రతినిధులు కోరారు. శనివారం బోధన్ ఆర్డీవో విజయకుమారికి వినతిపత్రం అందజేశారు. ఇళ్లు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, మధ్యవర్తుల ద్వారా ప్రత్యేకంగా దరఖాస్తులు సేకరిస్తున్నారని ఆరోపించారు.