హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేత్రపర్వంగా రాములవారి నిత్యకల్యాణం

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి నిత్యకల్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఉదయం సుప్రభాతసేవ, ఆరాధనలను పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం మిథిలా స్టేడియంలో వేదమంత్రాల నడుమ సీతారామలక్ష్మణుల కల్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.