MDK: శివ్వంపేట మండలం కొత్తపేట గ్రామంలో మంజూరైన 500 స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ నింగనబోయిన రాములు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తామని సర్పంచ్ పేర్కొన్నారు.
తెలంగాణ
కొత్తపేటలో స్మార్ట్ రేషన్ కార్డులు అందజేత


