హైదరాబాద్: 28°C
తెలంగాణ

మధ్యలోనే ఆగిన అంగన్వాడీ భవనం

MDK: హవేలిఘనపూర్ మండల కేంద్రంలో మూడు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో కేవలం ఒక్క దానికి మాత్రమే సొంత భవనం ఉంది. ఈ క్రమంలో పాత ఉన్నత పాఠశాలకు చెందిన వాటిలో శిథిలావస్థలో భవనంలో సాగుతున్నాయి. సంబంధిత గుత్తేదారుకు చేసిన పనులకు బిల్లులు రాక పనులు మధ్యలో ఆపేశారు. అధికారులు స్పందించి పనులు పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.