హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణపతి హోమంలో పాల్గొన్న చైర్ పర్సన్

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని 25వ వార్డులో శ్రీరామ్ సేన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి హోమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ పాల్గొన్నారు. గణనాథుడి ఆశీస్సులతో నర్సంపేట సుభిక్షంగా, అభివృద్ధి చెందాలని, ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, స్థానికులు పాల్గొన్నారు.