MDK: నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలం రాజాగౌడ్ (68) మృతి చెందారు. అతివేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం


