హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన

BHPL: భూపాలపల్లి ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై పోలీసులు శుక్రవారం అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగంతో ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు భవిష్యత్తు అంధకారమవుతుందని తెలిపారు. BNS ప్రకారం డ్రగ్స్‌ వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో కళాశాల అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.