హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగసాల చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

MBNR: జడ్చర్ల నాగసాల చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి చేపట్టిన ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ ఎం. గిరీష్ పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రత, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులతో చర్చించారు. నిమజ్జనం సందర్భంగా అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఉత్సవ కమిటీలకు సహకరించాలని సూచించారు.