హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసు ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్

వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల సీఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు ఉచిత పోలీసు పరీక్షల కోచింగ్ కోసం ఈ నెల 20న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సీకేఎం, ఎస్వీఎస్, సీజేఐటీ, పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాల, నర్సంపేట బిట్స్ కాలేజీల్లో పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు నేడు రాత్రి 8 గంటల్లోగా గూగుల్ ఫామ్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.