VKB: దౌల్తాబాద్ మండలంలో అల్లరాయప్ప జాతర బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. మండలంలోని ఇమ్డాపూర్ శివారులో చెట్టు కింద వెలసిన అల్లరాయప్ప స్వామి బ్రహ్మోత్సవాలను ఏటా భాద్రపద మాసంలో చేపడతారు. మండల వాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తారు. నేడు స్వామి వారిని పల్లకీలో ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి అభిషేకాలు చేసి నూతన వస్త్రాలు సమర్పిస్తారు.
తెలంగాణ
నేటి నుంచి అల్లరాయప్ప స్వామి బ్రహ్మోత్సవాలు


