హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రైవేటు కళాశాలలో విజిలెన్స్ తనిఖీలు

HNK: హన్మకొండ నగరంలోని భీమారంలోని ఎస్వీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గత నాలుగేళ్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల రికార్డులతో పాటు విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులు, ఖాతాలు, బోధన సిబ్బంది వివరాలను పరిశీలించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.