హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జాబ్ మేళాకు భారీ సంఖ్యలో హాజరైన నిరుద్యోగులు

SRPT: కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి కాన్వెంట్‌లో ఇవాళ నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అభ్యర్థులు క్యూలైన్‌లలో నిలబడి తమకు కేటాయించిన స్టాల్స్ వద్దకు చేరుకుని ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహం తెలిపారు.