హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గంజాయి సాగుపై ఉక్కుపాదం.. డ్రోన్లతో నిఘా!

ADB: జిల్లాలో పట్టుబడిన గంజాయి సాగు ప్రాంతాలను పోలీసులు డ్రోన్ల ద్వారా క్షుణ్ణంగా అన్వేషించారు. ఈ సందర్భంగా జిల్లా SP అఖిల్ మహాజన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా, అమ్మినా ఎంతటివారైనా సరే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. యువత భద్రతను దృష్టిలో ఉంచుకుని మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అణచివేస్తామని తేల్చిచెప్పారు.