హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైకోర్టు న్యాయమూర్తులకు కలెక్టర్ దివాకర స్వాగతం..!

ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎన్‌ఎస్‌పీ ప్రభుత్వ గెస్ట్ హౌస్‌కు విచ్చేసిన గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు, జస్టిస్ ఇ.వి. వేణుగోపాల్ గార్లను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మర్యాదపూర్వకంగా కలిశారు. నిన్న శుక్రవారం రాత్రి ఇక్కడికి చేరుకున్న న్యాయమూర్తులకు కలెక్టర్ ప్రత్యేకంగా పూలమొక్కలు అందజేసి సాదరంగా స్వాగతం పలికారు.