హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భవనం తొలిగిస్తే.. ఆటస్థలం ఏర్పడుతుంది'

WNP: అమ్రాబాద్ మండల కేంద్రంలోని జడ్పీ బాలికల పాఠశాలలో 50 ఏళ్ల కిందట నిర్మించిన తరగతి గదులు పాడయ్యాయి. వాటిని కూల్చకపోవడంతో విద్యార్థులు ఆ వైపు వెళ్లేందుకు భయపడుతున్నారు. నిరుపయోగంగా ఉన్న గదులు తొలగిస్తే విద్యార్థులకు ఆటస్థలం ఏర్పడుతుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.