హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనజీవి రామయ్య జీవితంపై సినిమా

JN: పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడాన్ని ఉద్యమంగా మార్చిన వనజీవి రామయ్య జీవితం ఆధారంగా సినిమా రూపొందిస్తున్నట్లు నిర్మాత నిడికొండ నరేశ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం బచ్చన్నపేట మండల కేంద్రంలోని పురాతన గడిలో సినిమా షూటింగ్ నిర్వహించారు. సుమారు 100 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయనున్నట్లు తెలిపారు. వనజీవి రామయ్య పాత్రలో బ్రహ్మాజీ, ఆయన భార్యగా నాగరాణి ఉన్నారు.